గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిరసన | doctors dharna at guntur government hospital | Sakshi
Sakshi News home page

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిరసన

Published Mon, Aug 31 2015 1:10 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

doctors dharna at guntur government hospital

గుంటూరు : ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ గుంటూరు ప్రభుత్వ వైద్య శాలలో సోమవారం వైద్యులు, నర్సులు నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎలుకలు కరవడం వల్ల కొన్ని రోజుల క్రితం ఇదే ఆస్పత్రిలో ఓ శిశువు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనకు బాధ్యులుగా ఆస్పత్రి సూపరింటెండెంట్, ఓ వైద్యుడ్ని ప్రభుత్వం బదిలీ చేయడంతోపాటు హెడ్‌నర్స్, స్టాఫ్ నర్స్‌లను సస్పెండ్ చేసింది. అన్యాయంగా తమపై  చర్యలు తీసుకున్నారని నర్స్‌లు ఆరోపించారు. వైద్యశాల సందర్శనకు వచ్చిన కలెక్టర్‌ను తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తానని ఆయన బదులిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement