నెల్లూరు జిల్లాలోని చేపల చెరువుల్లోని రొయ్యలను రాత్రికి రాత్రే మాయం చేస్తున్న ముగ్గురు కేటుగాళ్లను నెల్లూరు సీసీఎస్, విడవలూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని చేపల చెరువుల్లోని రొయ్యలను రాత్రికి రాత్రే మాయం చేస్తున్న ముగ్గురు కేటుగాళ్లను నెల్లూరు సీసీఎస్, విడవలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు సీసీఎస్ డీఎస్పీ పి.శ్రీధర్ శనివారం ఇక్కడ జరిగిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. విడవలూరుకు చెందిన వెంకట శేషయ్య, నెల్లూరు శెట్టిగుంట రోడ్డుకు చెందిన పసుపులేటి గణేశ్, గుంటూరు జిల్లా గురజాల మండలానికి చెందిన చోటూరు శిరీష్ పట్టుబడిన వారిలో ఉన్నారు. వీరి నుంచి రూ.2.05 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని, పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోందని డీఎస్పీ వెల్లడించారు.