న్యూఢిల్లీ: ఐఐటీ జీ ప్రవేశ పరీక్షల కోసం ప్రిపేరయ్యే విద్యార్థులు ఇక ఏటా వేలాది రూపాయలను కోచింగ్ సెంటర్లకు తగులబెట్టాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో ఉచిత కోచింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఐఐటీ యాజమాన్యం అంగీకరించింది. ఐఐటీలో పనిచేస్తున్న ప్రొఫసర్లే ఆన్‌లైన్‌లో కూడా కోచింగ్ ఇస్తారు. దీని కోసం ‘ఐఐటీపాల్’ అనే పోర్టల్ (ఐఐటీ ప్రొఫెసర్ అసిస్టెడ్ లర్నింగ్)ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ఇంటరాక్టివ్‌గా పనిచేస్తోంది. ఇందులో లెక్చర్ వీడియోలతోపాటు ప్రశ్న పత్రాలు, వాటికి జవాబులు కూడా అందుబాటులో ఉంటాయి.
ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌కు సంబంధించిన లెక్చర్ వీడియోలే కాకుండా విద్యార్థులకొచ్చే సందేహాలను ఎప్పటికప్పుడు ఈ పోర్టల్ తీరుస్తుంది. జీ పరీక్షకు సంబంధించిన 50 ఏళ్ల ప్రశ్న పత్రాలను, వాటి సొల్యూషన్స్‌ను కూడా పోర్టల్‌లో పొందుపరుస్తున్నారు. ఓ మొబల్ యాప్‌ను అభివృద్ధి చేసే ఆలోచన కూడా ఉంది. వేలాది రూపాయలను వెచ్చించినా కోచింగ్ సెంటర్లలో ‘ఆప్టిట్యూడ్’ను పెద్దగా పట్టించుకోరు. ఈ ఆన్‌లైన్ కోచింగ్‌లో ఆప్టిట్యూడ్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఐఐటీ సంస్థలు విద్యార్థుల ఫీజులను పెంచుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ ఉచిత కోచింగ్ ఎంతో ఉపయోగకరం.
ఐఐటీ ప్రవేశ పరీక్షలకు ఆన్‌లైన్‌లో ఉచిత కోచింగ్
Published Sat, Mar 19 2016 7:14 PM | Last Updated on Sun, Sep 3 2017 8:08 PM
Advertisement