పెరల్స్ బాధితుడి ఆత్మహత్య | perals Victim commits suicide in east godavari district | Sakshi
Sakshi News home page

పెరల్స్ బాధితుడి ఆత్మహత్య

Published Wed, Mar 2 2016 10:52 AM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM

perals Victim commits suicide in east godavari district

దేవీపట్నం: భవిష్యత్ అవసరాల కోసం డబ్బు దాచుకున్న వ్యక్తి ఆ డబ్బు సకాలంలో అందకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం దండంగి గ్రామంలో మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొత్తపల్లి సూరయ్య(70) పెరల్స్ సంస్థలో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేశాడు. ప్రస్తుతం డబ్బు అవసరం ఉండటంతో తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని ఏజెంట్‌ను కోరాడు. దానికి ఏజెంట్ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సూరయ్య కు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement