న్యూఢిల్లీః శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద 2015-16 కు గాను తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి 30 లక్షల చొప్పున కేంద్ర సాయాన్ని కేంద్ర గ్రామీణాభివృధ్ది మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లాలోని అల్లాపూర్ క్లస్టర్ కు రూ. 35 లక్షలు, మెదక్ జిల్లాలోని రాయకల్ క్లస్టర్ కు రూ. 35 లక్షలు, నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్ క్లస్టర్ కు రూ. 35 లక్షలు,ఆదిలాబాద్ జిల్లాలోని సారంగపల్లె క్లస్టర్ కు రూ. 25 లక్షల కేంద్ర సాయాన్ని ఈ మిషన్ కింద విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లాలోని కుప్పం క్లస్టర్ కు రూ. 35 లక్షలు, అనంతపురం జిల్లాలోని కంబదుర్ క్లస్టర్ కు రూ. 35 లక్షలు, ప్రకాశం జిల్లాలోని సిండరాయకొండ క్లస్టర్ కు రూ. 35 లక్షలు, విశాఖపట్నం జిల్లాలోని అరకు వేలీ క్లస్టర్ కు రూ. 25 లక్షల కేంద్ర సాయాన్నిఈ మిషన్ కింద విడుదల చేసారు.
రూర్బన్ మిషన్ కింద కేంద్ర సాయం
Published Sat, Mar 19 2016 7:51 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
Advertisement