'రాష్ట్రంకోసం సీఎం పదవినే వద్దనుకున్నా'
ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యే అవకాశం వచ్చినా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ పదవిని తీసుకోలేదని కాంగ్రేస్ జాతీయ నాయకులు జైపాల్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతుందనే భయంతోనే కేసీఆర్ విమర్శలకు పాల్పడుతున్నారన్నారు.
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే అవగాహన ఉందన్నారు. ఉధ్యమంలో భాగంగా తనను కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయలేదని విమర్శిస్తున్నారనీ.. ఒకవేళ తాను అలా చేసి ఉంటే హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఏర్పడి ఉండేది కాదని జైపాల్ రెడ్డి వివరించారు.