ఆగిన బాల్య వివాహం | Stopping child marriage in Child-line staff | Sakshi
Sakshi News home page

ఆగిన బాల్య వివాహం

Published Sat, Apr 9 2016 10:33 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

Stopping child marriage in Child-line staff

వికారాబాద్ రూరల్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండల పరిధిలోని సిద్దులూరు గ్రామంలో అధికారులు శనివారం బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన ఓ బాలిక (15) వివాహాన్ని ఆదివారం హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తితో వివాహం చేసేందుకు నిశ్చయించారు.

ఈ విషయం చైల్డ్‌లైన్ సిబ్బందికి సమాచారం అందడంతో చైల్డ్‌లైన్ సిబ్బంది, వికారాబాద్ ఎస్‌ఐ మల్లేశం గ్రామానికి చేరుకుని వివాహాన్ని నిలిపి వేశారు. మైనర్ బాలికకు వివాహం చేయకూడదనిజజజ బలవంతంగా వివాహం చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని కౌన్సెలింగ్ ఇచ్చారు. వివాహం చేయబోమని బాలిక తల్లిదండ్రుల నుంచి లిఖిత పూర్వక హామీని తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement