ఓయూలో నిరుద్యోగుల భారీ ర్యాలీ
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ యువకులు శుక్రవారం భారీ ర్యాలీ తీశారు. గ్రూప్2 పోస్టుల సంఖ్య పెంచాలని కోరుతూ మెయిన్ లైబ్రరీ నుంచి ఎన్‌సీసీ గేట్ విద్యానగర్ వైపు వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. అలాగే గ్రూప్2 పరీక్ష తేదీ పొడిగించాలని, పరీక్ష పాత పద్దతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇంటర్వూ విధానం రద్దు చేయాలని, జేఎల్ అండ్ డీఎల్ ఉద్యోగాల క్రమబద్దీకరణను ఉపసంహరించుకోవాలని కోరారు.