కృష్ణా కరకట్ట వద్ద ఉద్రిక్తత | tension at krishna karrakatta | Sakshi
Sakshi News home page

కృష్ణా కరకట్ట వద్ద ఉద్రిక్తత

Published Fri, Nov 20 2015 8:57 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

tension at krishna karrakatta

గుంటూరు: కృష్ణా కరకట్ట ఒడ్డున శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరకట్ట వద్ద ఉన్నమత్య్సకారుల ఇళ్లను తొలగించేందుకు అధికారుల ఏర్పాట్లు చేపట్టారు. అయితే మత్య్సకారులకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అధికారులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 50 ఏళ్లుగా నివాసముంటున్న వారి ఇళ్లను తొలగించడం అన్యాయమని ఆయన విమర్శించారు.

ప్రత్యామ్నాయం చూపకుండా మత్య్సకారుల ఇళ్లను తొలగించడం సరికాదన్నారు. అక్రమ నిర్మాణంలో సీఎం చంద్రబాబు నాయుడు రెస్ట్ హౌజ్ ను  ఏర్పాటు చేసుకున్నారన్నారు. రెస్ట్ హౌజ్ నిర్మాణం అక్రమమో, సక్రమమో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణంలో బస చేసే సీఎం కు పేదల ఇళ్లను తొలగించే హక్కు లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement