వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. తన భర్తను రెండో పెళ్లి చేసుకుందని ఆగ్రహించిన మొదటి భార్య బంధువులతో కలిసి రెండో భార్యపై దాడి చేసింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా సాటి ఆడది అని కూడా చూడకుండా.. చెప్పెలేని చోట వాతలు పెట్టింది. ఇనుప సువ్వలను కాల్చి వాతలు పెట్టి తీవ్రంగా హింసించింది. అనంతరం బంధువులంతా కలిసి ఆమెను వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం డీసీ తండాలో సోమవారం వెలుగుచూసింది.
తండాకు చెందిన ఆంగోతు రవి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ పెద్దలు నిర్ణయించిన మేరకు స్వరూపను వివాహమాడాడు. అనంతరం అదే తండాకు చెందిన అనిత(24)ను ఎవరికి తెలియకుండా ఎనిమిది నెలల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం పై మొదటి భార్య స్వరూప తల్లిదండ్రులు పలుమార్లు కుల పెద్దల ఎదుట పంచాయితి నిర్వహించారు.
అయినా రవి తన తీరు మార్చుకోకపోవడంతో.. ఆగ్రహించిన స్వరూప బంధువులు ఆదివారం రాత్రి అనితపై దాడి చేశారు. కర్రలు ఇనుప సువ్వలతో ఆమెను చిత్రహింసలకు గురిచేసి అనంతరం ఆమెను వివస్త్రను చేసి తండాలో తిప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాదితురాలని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తన భర్తను రెండో పెళ్లి చేసుకుందని...
Published Mon, Feb 8 2016 11:17 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM
Advertisement
Advertisement