మరో మూడు దేశాల్లో ‘108’ | 108 emergency services in another three countries | Sakshi
Sakshi News home page

మరో మూడు దేశాల్లో ‘108’

Published Sun, Aug 16 2015 1:00 PM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM

మరో మూడు దేశాల్లో  ‘108’

మరో మూడు దేశాల్లో ‘108’

సాక్షి, హైదరాబాద్: మరో మూడు దేశాలకు ‘108’ అత్యవసర అంబులెన్స్ సేవలను విస్తరించనున్నట్లు జీవీకే-ఈఎంఆర్‌ఐ చైర్మన్ జీవీకే రెడ్డి వెల్లడించారు. శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్‌లలో ‘108’ వైద్య సేవలను విస్తరిస్తున్నామన్నారు. ‘108’ ప్రారంభమై పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ పదేళ్లలో 15 లక్షలమంది ప్రాణాలను కాపాడామన్నారు. ఈ ఏడాది చివరికి శ్రీలంకలో సేవలు ప్రారంభమవుతాయని, ఈ మేరకు ఆ దేశంతో ఒప్పందం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు. తద్వారా రహదారి వసతిలేని మారుమూల గ్రామాల ప్రజలకూ అత్యవసర వైద్య సేవలు అందించడానికి వీలవుతుందన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement