ఆగి ఉన్నలారీని ఢీకొట్టిన కారు : ఇద్దరి మృతి
Published Wed, Mar 16 2016 9:26 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
హైదరాబాద్: ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని కొంపల్లి జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతులు బోరంపేటకు చెందినవారిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement