
మెట్రో నిర్మాణ పనుల్లో అపశ్రుతి
- బెక్‌పై వెళ్తున్న గృహిణి తలకు తీవ్ర గాయాలు
నాంపల్లి/కాచిగూడ: మెట్రో రైలు నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఖైరతాబాద్ షాదన్ కాలేజీలో తమ కుమార్తె స్టడీ సర్టిఫికెట్ తీసుకొచ్చేందుకు భర్తతో కలసి బైక్‌పై వెళ్తున్న మహిళ తలపై మెట్రో కారిడార్ నుంచి ఇనుపరాడ్ పడింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. నాంపల్లిలో జరుగుతున్న మెట్రో నిర్మాణ పనుల్లో శనివారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రెయిన్ బజార్‌కి చెందిన దంపతులు అబ్దుల్ హఫీజ్, ఉజ్మా హఫీజ్ (38) కుమార్తె ఖైరతాబాద్‌లోని షాదన్ కాలేజీలో ఎంసీసీ చదివింది.
ఆమె స్టడీ సర్టిఫికెట్ తీసుకొచ్చేందుకు అబ్దుల్, ఉజ్మా ద్విచక్రవాహనంపై కాలేజీకి బయలుదేరారు. నాంపల్లి సుప్రభాత్ రెస్టారెంట్ సమీపంలోకి రాగానే... వెనకాల కూర్చున్న ఉజ్మా తలపై మెట్రో కారిడార్ నుంచి ఇనుప రాడ్ జారిపడింది. తలకు తీవ్ర గాయమైన ఉజ్మా ను వెంటనే సమీపంలోని మెడ్విన్ ఆసుపత్రికి తర లించారు. పరిస్థితి విష మంగా ఉండటంతో... అక్కడి నుంచి హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. తలకు ఆపరేషన్ చేసిన వైద్యులు.. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.