ఇద్దరు మహిళ దొంగల అరెస్ట్
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ జనార్ధన్ తెలిపిన వివరాలు.. మహారాష్ర్టకు చెందిన మొమిన్ సుల్తానా(50), హలీమా బేగం(42)లు బ్రతుకు దెరువు నిమిత్తం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు. ఆర్ధిక ఇబ్బందులతో ఈజీ మనీ సంపాదించే మార్గాలు వెతుకున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్యాసెంజర్ల వద్ద పర్సులను, బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించడం ప్రారంభించారు. ప్రయాణికులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో వీరు 9 కేసుల్లో నిందితులుగా తేల్చారు. వీరి వద్ద నుంచి 18.5 తులాల బంగారం, 22.5 తులాల వెండి, ఓ మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.