women theft
-
యూపీలో మహిళా చోరులు!
లక్నో: ముసుగులు ధరించిన మహిళలు ఆయుధాలు చేతబూని భారీ దొంగతనానికి పూనుకున్నారు. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి దర్జాగా ప్రవేశించి కేవలం 50 నిమిషాల్లో ఉన్నదంతా ఊడ్చేసి గోతాముల్లో నింపుకుని వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. ఈ నెల ఏడో తేదీన తెల్లవారుజామున 3 గంటలకు ఆషియానా పోలీస్‌స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ సందీప్ గులాటి ఇంట్లో ఈ మహిళా దొంగలు చొరబడ్డారు. ఒకరిద్దరు ఆయుధాలతో బయట కాపలాగా ఉండిపోగా మిగతా వారు ఇంట్లో సీలింగ్ ఫ్యాన్లు సహా ప్రతి వస్తువు తీసుకుని ఐదు బస్తాల నిండా దర్జాగా నింపుకుని నెమ్మదిగా వెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
వైరల్ : 8 ప్యాంట్లు తొడుక్కొని.. అడ్డంగా బుక్కైంది
మనం సాధారణంగా వస్త్ర దుకాణానికి వెళితే కావలిసినవి కొనుక్కుంటాం. కానీ ఓ యువతి మాత్రం షాప్‌కు వెళ్లి చోరీ చేద్దామని భావించి అడ్డంగా బుక్కైంది. ఈ వింత ఘటన వెనిజులాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. వెనిజులాలో ఓ యువతి వస్త్ర దుకాణానికి వెళ్లింది. అక్కడ జీన్స్ ర్యాక్ వద్దకు వెళ్లి 8 ప్యాంట్లు తీసుకొని డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి ఒకదాని మీద ఒకటి ధరించి చోరీ చేసేందుకు యత్నించింది. కాగా, యువతి ప్రవర్తనపై అనుమానం కలిగిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డగించి వాష్‌రూమ్‌కు తీసుకెళ్లారు. ఆమె వేసుకున్న ప్యాంట్‌ను విప్పమన్నారు. దీంతో సదరు యువతి ఒక్కొక్క ప్యాంట్ విప్పుతూ.. మొత్తం 8ప్యాంట్లను బయటికి తీయడంతో సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే ఇదంతా వీడియో తీసీ ఫేస్బుక్లో షేర్ చేయడంతో 4.2 మిలియన్స్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. ' ఈమె చోరీలు చేయడంలో చాలా నేర్పరి. కొంచెం అజాగ్రత్తగా వ్యవహరించి ఉంటే దర్జాగా బయటకు వెళ్లిపోయేదే' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
'సెంచరీ' చెంచులక్ష్మి చిక్కింది
మేడ్చల్: గడ్డం లక్ష్మి అలియాస్ చెంచులక్ష్మి ఉరఫ్ గుండ్ల పోచమ్మ. 34 ఏళ్ల ఈ మహిళ తన 14వ ఏట నుంచే దొంగతనాలు మొదలుపెట్టింది. ఇప్పటివరకు 100 చోరీలకు పాల్పడిన ఆమెను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితురాలినుంచి రూ.7.75 లక్షల విలువచేసే బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం చేయడంలో తనదైన ముద్ర వేసుకున్న చెంచు లక్ష్మికి సంబంధించిన వివరాలను పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్ కుమార్, సైబరాబాద్ క్రైమ్ విభాగం ఏసీసీ ఉషారాణిలు మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. నగరంలోని సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటకు చెందిన గడ్డం లక్ష్మి అలియూస్ చెంచులక్ష్మి అలియూస్ గుండ్లపోచవ్ము (34) తన 14వ ఏట నుంచే దొంగతనాలు చేయుడం మొదలుపెట్టింది. ప్రతిరోజూ కూలీ పనిచేస్తున్నట్లు నమ్మిస్తూ.. తాళం వేసిన ఇళ్లల్లో పగటిపూట దొంగతనాలకు పాల్పడుతూ.. దొంగిలించిన సొమ్మును తన వదిన అరుణ అలియాస్ మంగమ్మ వద్ద దాచిపెట్టేది. గత ఏడాది నిరుడు జూలై లో మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మేడ్చల్ పట్టణంలోని ఉమానగర్, వినాయుక్నగర్, వెంకటరామయ్యు కాలనీల్లో తాళం వేసి ఉన్న పలు ఇళ్లల్లో దొంగతనాలు జరిగాయి. దీంతో నిందితులను పట్టుకునేందుకు పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కువూర్, బాలానగర్ నేరవిభాగం ఏసీపీ ఉషారాణి, సైబరాబాద్ సీసీఎస్ (క్రైమ్ కంట్రోల్ స్టేషన్) సీఐ సైదులు, మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి సంయుక్తంగా దర్యాప్తు జరపగా.. పాత నేరస్తురాలైన చెంచులక్ష్మి ఈ దొంగతనాలకు పాల్పడినట్లు తేలింది. దీంతో సోవువారం ఉదయుం మేడ్చల్ రైల్వేస్టేషన్ సమీపంలో చెంచులక్ష్మి, మంగవ్ములను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో పోలీసులు విచారించగా దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. లక్ష్మి చేసే దొంగతనాల రూటే వేరు.. పగటిపూట కాలనీల్లో తిరుగుతూ రెక్కీ జరిపే లక్ష్మి.. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి తాను చేయాలనుకున్నట్టుగా దొంగతనానికి స్కెచ్ వేస్తుంది. రెండుమూడుసార్లు రెక్కీ నిర్వహించి చాకచక్యంగా ఇంటి ఆవరణలోకి వెళ్లి గుట్టుచప్పుడు కాకుండా తాళం పగులగొట్టి దర్జాగా ఇంట్లోకి చొరబడుతుంది. ఇంటిలోకి వెళ్లి మొదట బీరువా తాళం చెవి కోసం ఇల్లంతా వెతికి.. దొరికితే బీరువాను దోచుకోవడం.. లేదంటే ఇంట్లో ఉన్న విలువైన సామగ్రిని దోచుకెళ్లడం ఆమె స్టైల్. దొంగతనం చేసిన సొత్తును సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట్‌లో ఉండే తన వదిన మంగవ్ము వద్ద దాచిపెట్టి సవుయూన్ని బట్టి వాటిని విక్రయిస్తుండేది. 100 కేసుల్లో లక్ష్మి నిందితురాలు.. మేడ్చల్, కేపీహెచ్‌బీ, దుండిగల్, శామీర్‌పేట్, జీడిమెట్ల, పేట్‌బషీరాబాద్, వుహబూబ్‌నగర్ జిల్లా అయిజ, కర్నూలు జిల్లా చెగలవుర్రి పోలీస్స్టేషన్ల పరిధిలో లక్ష్మి గత జులై నుంచి 11 దొంగతనాలకు పాల్పడింది. గతంలో ఆమెపై హైదరాబాద్ కమి షనరేట్ పరిధిలోని ఆసిఫ్‌నగర్, హువూయుున్నగర్, నల్లకుంట, లంగర్‌హౌజ్, వులక్‌పేట్, కుల్సుంపుర, తిరువులగిరి, బోరుున్‌పల్లి, సైబరాబాద్ పరిధిలోని చందానగర్, ఉప్పల్, వుల్కాజిగిరి, రాజేంద్రనగర్, శంషాబాద్, నార్సింగి, సనత్‌నగర్, మెదక్ జిల్లా రావుచంద్రాపురం, వుహబూబ్‌నగర్ జిల్లా అమ్మిగనూరు పోలీస్స్టేషన్ల పరిధిలో దాదాపు 100 నేరాలకు పాల్పడి పలువూర్లు జైలుకు వెళ్లి బెయిలుపై వచ్చింది. ప్రస్తుతం శంషాబాద్, రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఆమెపై నాన్‌బెరుులబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉంది. లక్ష్మిపై పీడీ యూక్ట్ నమోదు చేసే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు. -
ఇద్దరు మహిళ దొంగల అరెస్ట్
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ జనార్ధన్ తెలిపిన వివరాలు.. మహారాష్ర్టకు చెందిన మొమిన్ సుల్తానా(50), హలీమా బేగం(42)లు బ్రతుకు దెరువు నిమిత్తం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు. ఆర్ధిక ఇబ్బందులతో ఈజీ మనీ సంపాదించే మార్గాలు వెతుకున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్యాసెంజర్ల వద్ద పర్సులను, బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించడం ప్రారంభించారు. ప్రయాణికులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో వీరు 9 కేసుల్లో నిందితులుగా తేల్చారు. వీరి వద్ద నుంచి 18.5 తులాల బంగారం, 22.5 తులాల వెండి, ఓ మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. -
మహిళా దొంగ అరెస్టు
ముదిగొండ: ఖమ్మం జిల్లాలో ఓ మహిళా దొంగ పోలీసులకు చిక్కింది. ఈ ఘటన మదిగొండ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. జిల్లాలోని చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన పసుపు లేటి పద్మ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీకి పాల్పడింది. ఆమెను మదిగొండ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. నిందితురాలు నుంచి రూ 6.5 లక్షల విలువు చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు.