'సెంచరీ' చెంచులక్ష్మి చిక్కింది | women thief gaddam lakshmi, who involved in 100 robbery cases has been arrested by police | Sakshi
Sakshi News home page

'సెంచరీ' చెంచులక్ష్మి చిక్కింది

Published Mon, May 16 2016 10:37 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

(ప్రతీకాత్మక చిత్రం) - Sakshi

(ప్రతీకాత్మక చిత్రం)

మేడ్చల్: గడ్డం లక్ష్మి అలియాస్ చెంచులక్ష్మి ఉరఫ్ గుండ్ల పోచమ్మ. 34 ఏళ్ల ఈ మహిళ తన 14వ ఏట నుంచే దొంగతనాలు మొదలుపెట్టింది. ఇప్పటివరకు 100 చోరీలకు పాల్పడిన ఆమెను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితురాలినుంచి రూ.7.75 లక్షల విలువచేసే బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం చేయడంలో తనదైన ముద్ర వేసుకున్న చెంచు లక్ష్మికి సంబంధించిన వివరాలను పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్ కుమార్, సైబరాబాద్ క్రైమ్ విభాగం ఏసీసీ ఉషారాణిలు మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

నగరంలోని సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటకు చెందిన గడ్డం లక్ష్మి అలియూస్ చెంచులక్ష్మి అలియూస్ గుండ్లపోచవ్ము (34) తన 14వ ఏట నుంచే దొంగతనాలు చేయుడం మొదలుపెట్టింది. ప్రతిరోజూ కూలీ పనిచేస్తున్నట్లు నమ్మిస్తూ.. తాళం వేసిన ఇళ్లల్లో పగటిపూట దొంగతనాలకు పాల్పడుతూ.. దొంగిలించిన సొమ్మును తన వదిన అరుణ అలియాస్ మంగమ్మ వద్ద దాచిపెట్టేది. గత ఏడాది నిరుడు జూలై లో మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మేడ్చల్ పట్టణంలోని ఉమానగర్, వినాయుక్‌నగర్, వెంకటరామయ్యు కాలనీల్లో తాళం వేసి ఉన్న పలు ఇళ్లల్లో దొంగతనాలు జరిగాయి. దీంతో నిందితులను పట్టుకునేందుకు పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కువూర్, బాలానగర్ నేరవిభాగం ఏసీపీ ఉషారాణి, సైబరాబాద్ సీసీఎస్ (క్రైమ్ కంట్రోల్ స్టేషన్) సీఐ సైదులు, మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి సంయుక్తంగా దర్యాప్తు జరపగా.. పాత నేరస్తురాలైన చెంచులక్ష్మి ఈ దొంగతనాలకు పాల్పడినట్లు తేలింది. దీంతో సోవువారం ఉదయుం మేడ్చల్ రైల్వేస్టేషన్ సమీపంలో చెంచులక్ష్మి, మంగవ్ములను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో పోలీసులు విచారించగా దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు.

లక్ష్మి చేసే దొంగతనాల రూటే వేరు..
పగటిపూట కాలనీల్లో తిరుగుతూ రెక్కీ జరిపే లక్ష్మి.. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి తాను చేయాలనుకున్నట్టుగా దొంగతనానికి స్కెచ్ వేస్తుంది. రెండుమూడుసార్లు రెక్కీ నిర్వహించి చాకచక్యంగా ఇంటి ఆవరణలోకి వెళ్లి గుట్టుచప్పుడు కాకుండా తాళం పగులగొట్టి దర్జాగా ఇంట్లోకి చొరబడుతుంది. ఇంటిలోకి వెళ్లి మొదట బీరువా తాళం చెవి కోసం ఇల్లంతా వెతికి.. దొరికితే బీరువాను దోచుకోవడం.. లేదంటే ఇంట్లో ఉన్న విలువైన సామగ్రిని దోచుకెళ్లడం ఆమె స్టైల్. దొంగతనం చేసిన సొత్తును సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట్‌లో ఉండే తన వదిన మంగవ్ము వద్ద దాచిపెట్టి సవుయూన్ని బట్టి వాటిని విక్రయిస్తుండేది.

100 కేసుల్లో లక్ష్మి నిందితురాలు..
మేడ్చల్, కేపీహెచ్‌బీ, దుండిగల్, శామీర్‌పేట్, జీడిమెట్ల, పేట్‌బషీరాబాద్, వుహబూబ్‌నగర్ జిల్లా అయిజ, కర్నూలు జిల్లా చెగలవుర్రి పోలీస్‌స్టేషన్ల పరిధిలో లక్ష్మి గత జులై నుంచి 11 దొంగతనాలకు పాల్పడింది. గతంలో ఆమెపై హైదరాబాద్ కమి షనరేట్ పరిధిలోని ఆసిఫ్‌నగర్, హువూయుున్‌నగర్, నల్లకుంట, లంగర్‌హౌజ్, వులక్‌పేట్, కుల్సుంపుర, తిరువులగిరి, బోరుున్‌పల్లి, సైబరాబాద్ పరిధిలోని చందానగర్, ఉప్పల్, వుల్కాజిగిరి, రాజేంద్రనగర్, శంషాబాద్, నార్సింగి, సనత్‌నగర్, మెదక్ జిల్లా రావుచంద్రాపురం, వుహబూబ్‌నగర్ జిల్లా అమ్మిగనూరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో దాదాపు 100 నేరాలకు పాల్పడి పలువూర్లు జైలుకు వెళ్లి బెయిలుపై వచ్చింది. ప్రస్తుతం శంషాబాద్, రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఆమెపై నాన్‌బెరుులబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉంది. లక్ష్మిపై పీడీ యూక్ట్ నమోదు చేసే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement