2,444 ‘గురుకుల’ పోస్టులకు ఉత్తర్వులు | 2444 Gurukul posts | Sakshi
Sakshi News home page

2,444 ‘గురుకుల’ పోస్టులకు ఉత్తర్వులు

Published Fri, Apr 8 2016 4:56 AM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM

2,444 ‘గురుకుల’ పోస్టులకు ఉత్తర్వులు

2,444 ‘గురుకుల’ పోస్టులకు ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో 2,444 ఖాళీ పోస్టులను గుర్తిస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ గురుకుల విద్యాలయ సంస్థల సొసైటీల పరిధిలో ఉన్న ఖాళీలన్నింటినీ సమీక్షించిన ప్రభుత్వం ఈ జాబితాను వెల్లడించింది. పోస్టులవారీగా ఖాళీల వివరాలతో ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 758 పోస్టులు, ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో 313, బీసీ సంక్షేమ గురుకులాల్లో 307, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 436, మైనారిటీ సంక్షేమ శాఖ గురుకులాల్లో 630 పోస్టులు గుర్తించిన వాటిలో ఉన్నాయి.

డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిన ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టే బాధ్యతలను టీఎస్‌పీఎస్‌సీకి ప్రభుత్వం అప్పగించింది. ఆయా విభాగాలు అందించే లోకల్ కేడర్, సబ్జెక్ట్‌లవారీగా ఖాళీల వివరాలు, రోస్టర్ పాయింట్లు, అర్హతలను ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. పోస్టులవారీగా ఈ వివరాలను వెంటనే టీఎస్‌పీఎస్‌సీకి అందించాలని సంబంధిత విభాగాలను ఆర్థిక శాఖ ఆదేశించింది. వీలైనంత త్వరగా ఈ నియామకాలకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ జారీ చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
 
విభాగాల వారీగా పోస్టులు, ఖాళీల వివరాలు:
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో మొత్తం 758 పోస్టులున్నాయి. వీటిలో 12 ప్రిన్సిపల్, 560 టీజీటీ, 79 పీఈటీ, 52 ఆర్ట్/మ్యూజిక్, 3 క్రాఫ్ట్, 34 లైబ్రేరియన్, 18 స్టాఫ్ నర్స్ పోస్టులున్నాయి. తెలంగాణ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో ఉన్న 313 పోస్టుల్లో 6 జూనియర్ లెక్చరర్లు(ఇంటర్), 136 పీజీటీ, 74 టీజీటీ, 22 పీఈటీ, 43 ఆర్ట్/క్రాఫ్ట్/మ్యూజిక్ టీచర్, 32 స్టాఫ్ నర్స్ పోస్టులున్నాయి. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో 307 పోస్టులున్నాయి.

వీటిలో 7 ప్రిన్సిపల్, 83 పీజీటీ, 99 టీజీటీ, 16 పీఈటీ, 28 ఆర్ట్ టీచర్, 16 స్టాఫ్ నర్స్, 22 జూనియర్ లెక్చరర్(ఇంటర్), 36 డిగ్రీ కాలేజీ లెక్చరర్ల పోస్టులున్నాయి. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో 436 పోస్టులున్నాయి. వీటిలో 41 జూనియర్ లెక్చరర్లు(ఇంటర్), 26 లైబ్రేరియన్, 40 పీజీటీ, 271 టీజీటీ, 6 పీడీ, 33 పీఈటీ, 19 ఆర్ట్/క్రాఫ్ట్/మ్యూజిక్ టీచర్ పోస్టులున్నాయి. తెలంగాణ మైనారిటీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో 630 పోస్టులున్నాయి. 70 ప్రిన్సిపల్, 350 టీజీటీ, 70 పీఈటీ, 70 స్టాఫ్ నర్స్, 70 క్రాఫ్ట్/ఆర్ట్/మ్యూజిక్ టీచర్ పోస్టులున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement