
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పోస్టులతోపాటు కొత్త కాలేజీలకు మంజూరయ్యే పోస్టులనూ భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొత్తంగా 131 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 2,487 పోస్టులను ఏప్రిల్‌లోగా భర్తీ చేయాలని భావిస్తోంది. వీటిలో పాత డిగ్రీ కాలేజీల్లో 1,273 పోస్టులు, 2008–09 నుంచి ఇప్పటివరకు మంజూరైన 60 కాలేజీల్లో మరో 1,214 పోస్టులను సృష్టించి భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 75% పోస్టులను పదోన్నతుల ద్వారా, 25% పోస్టులను ప్రత్యక్ష నియామక పద్ధతిలో భర్తీ చేసే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని 71 డిగ్రీ కాలేజీల్లో 2,761 డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. వాటిల్లో 1,488 పోస్టుల్లోనే రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు. మరో 1,273 పోస్టుల్లో 384 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, 889 మంది గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు. వీటి భర్తీ కోసం కళాశాల విద్యా శాఖ గతంలో పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉండగా, కొత్త కాలేజీల్లో 1,214 పోస్టులను సృష్టించి భర్తీ చేసేందుకు ఇటీవల ప్రతిపాదనలు పంపించింది.
Comments
Please login to add a commentAdd a comment