హైదరాబాద్: నగరంలో నేడు ఒక్కరోజే పురాతన, శిథిలావస్థలో ఉన్న 48 ఇళ్లను జీహెచ్ఎంసి టౌన్‌ప్లానింగ్ సిబ్బంది కూల్చివేశారని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్ధన్‌రెడ్డి వెల్లడించారు. ఈ సీజన్‌లో ఇంత పెద్ద సంఖ్యలో 48ఇళ్లను కూల్చివేయడం రికార్డు అని అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల సందర్భంగా ఈ పురాతన ఇళ్లు కూలే ప్రమాదం ఉన్నందున నేడు అధిక సంఖ్యలో ఇళ్లను తొలగించినట్టు తెలిపారు.
ఈ నెల 12వ తేదీ నుండి నేటి వరకు కేవలం పది రోజుల వ్యవధిలో 132 పురాతన, శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేసినట్టు చెప్పారు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటి వరకు 416 భవనాలను కూల్చివేశామని ఆయన తెలిపారు. దీంతో పాటు గత పదిరోజుల్లో పురాతన భవనాలను ఖాళీ చేయాల్సిందిగా చేపట్టిన ప్రత్యేక కౌన్సిలింగ్‌కు అనుగుణంగా నేడు 12 భవనాలను స్వచ్ఛందంగా ఖాళీ చేసి సహకరించారని ఆయన తెలిపారు. ఒక భవనాన్ని సీజ్ చేశామని ఆయన తెలిపారు. నగరంలో పురాతన భవనాలను ఖాళీ చేయించడం, తొలగించడం, పటిష్టపర్చడం తదితర చర్యలను చేపట్టడం వల్ల ఈ వర్షాకాల సీజన్‌లో ఇళ్లు కూలిన సంఘటనలో ఏవిధమైన ప్రాణనష్టంతో పాటు గాయపడ్డ సంఘటనలు ఇంత వరకు జరగలేదని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
'ఒక్కరోజే 48 శిథిల భవనాల కూల్చివేత'
Published Fri, Sep 23 2016 8:37 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
Advertisement
Advertisement