నగరంలో మరో ఏడు ఐటీ పార్కులు | 7 IT parks to be built in Hyderabad | Sakshi
Sakshi News home page

నగరంలో మరో ఏడు ఐటీ పార్కులు

Published Sat, Jul 2 2016 8:01 PM | Last Updated on Mon, Oct 22 2018 7:57 PM

7 IT parks to be built in Hyderabad

హైదరాబాద్ : ప్రపంచ దిగ్గజ కంపెనీలకు ఎర్ర తివాచీ పరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం రాజధాని శివార్లలో మరో ఏడు ఐటీ పార్కులను ఏర్పాటు చేస్తోంది. ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలు హైదరాబాద్‌కు తరలివస్తున్న నేపథ్యంలో.. అందుకనువైన వసతులను కల్పించే దిశగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. ఈ మేరకు నగర శివార్లలో ఐటీ పార్కులకు అవసరమైన భూములను గుర్తించింది. వివాదరహిత ఈ భూములను సాఫ్ట్‌వేర్ సంస్థల స్థాపనకు అనువుగా ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. నిర్ధేశిత ఐటీ పార్కుల జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపడం ద్కారా సాఫ్ట్‌వేర్ కంపెనీలకు ద్వారాలు తెరవాలని భావిస్తోంది. కాగా, ఇప్పటికే ఐటీ హబ్‌గా మారిన గచ్చిబౌలి, మాదాపూర్ కాకుండా... ఐటీ పరిశ్రమను మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రభుత్వం సంకల్పించింది.

ఏడింటికి అంగీకారం..

శివార్లలో తొమ్మిది చోట్ల ఐటీ పార్కులను ప్రకటించాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే, ఇందులో రెండు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఏడింటికి సూత్రప్రాయంగా ఆమోదించింది. ఇటీవల ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో ఐటీ పార్కుల అభివద్ధిపై విస్తత చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే బుద్వేల్‌లో పర్యాటక సంస్థకు చెందిన సర్వే నం.291 టు 299/పీ వరకు గల 91 ఎకరాలు, సర్వే నంబర్లు 282-299 లలోని 164.35 ఎకరాలను ఐటీ పార్కులకు వినియోగించనున్నారు.

అలాగే, ఇటీవల జర్నలిస్టుల హౌసింగ్ కాలనీ కోసం ప్రతిపాదించిన బుద్వేల్‌లోని వీడీఓటీ సీ ఆధీనంలో ఉన్న 120 ఎకరాల్లో ఐటీ పార్కు అభివృద్ధి చేయనున్నారు. జర్నలిస్టులకు ప్రత్యామ్నాయంగా మియాపూర్‌లో కేటాయించాలని నిర్ణయించారు. అలాగే వాలంటరీలోని 252 ఎకరాలు, పుప్పాల్‌గౌడ సర్వే నంబర్లు 304-307, 329, 331-339లలోని 100.12 ఎకరాల్లో కూడా ఐటీ పార్కు రానుంది. శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని సర్వే నంబర్లు 28, 29లలోని 160 ఎకరాలు, కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్‌లోని సర్వే నంబర్లు 453, 454లోని భూమిని కూడా ఐటీ పార్కును ఏర్పాటు చేయనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement