చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన శిశువు
హైదరాబాద్: ఎల్‌బీనగర్ మన్సూరాబాద్ వీకర్ సెక్షన్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఏమాత్రం కనికరం లేకుండా అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో పడేసి వెళ్లారు. చిన్నారి ఏడుపు విని గుర్తించిన కాలనీ వాసి శేఖర్ శిశువును తీసుకెళ్లారు. తనకు పిల్లలు లేనందున పెంచుకుంటానని ఆయన చెబుతున్నారు. ఏం కష్టమొచ్చిందని పురిటిలోని పిల్లవాడిని చెట్ల పొదల్లో పడేశారు అంటూ స్థానికులు తల్లిదండ్రులను దూషిస్తున్నారు.