తమ వాళ్ల అరెస్టుకు నిరసనగా నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆరోగ్య శ్రీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్ : తమ వాళ్ల అరెస్టుకు నిరసనగా నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆరోగ్య శ్రీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఆరోగ్యశ్రీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తమకు జీతాలు పెంచాలని కోరుతూ గత మూడు రోజులుగా ఆరోగ్యశ్రీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. ఆందోళన చేపట్టిన కొందరు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పీఎస్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.