ఉమ్మడి ప్రాజెక్టుల వివరాలివ్వండి | AK Bajaj Committee asks telugu states over irrigation projects | Sakshi
Sakshi News home page

ఉమ్మడి ప్రాజెక్టుల వివరాలివ్వండి

Published Wed, Jan 11 2017 3:28 AM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM

ఉమ్మడి ప్రాజెక్టుల వివరాలివ్వండి

ఉమ్మడి ప్రాజెక్టుల వివరాలివ్వండి

తెలంగాణ, ఏపీని కోరిన ఏకే బజాజ్‌ కమిటీ
సాగర్, శ్రీశైలం, జూరాల, పులిచింతల, సుంకేశుల కింద
30 ఏళ్ల నీటి వివరాలివ్వాలని ఆదేశం


సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టుల వివరాలన్నీ తమకు సమ ర్పించాలంటూ కేంద్ర జల వనరుల శాఖ ఐదు గురు సభ్యులతో నియమించిన ఏకే బజాజ్‌ కమిటీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రధాన కార్య దర్శులను ఆదేశించింది. జూరాల, నాగా ర్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టుల వివరాలు ఇవ్వాలని కమిటీ తెలంగాణను కోర గా... వీటితోపాటు సుంకేశుల వివరాలు కూడా ఇవ్వాలని ఏపీని ఆదేశించింది. తెలంగాణ, ఏపీ సమర్పించే ఈ లెక్కల ఆధారంగా.. బోర్డు ఇరు రాష్ట్రాలను సంప్రదించి ప్రాజెక్టుల వర్కింగ్‌ మాన్యువల్‌ తయారు చేయనుంది. 2 రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై నియ మావళి, మార్గదర్శకాలు రూపొందించే అంశం పై పది రోజుల కిందటే కమిటీ చర్చలు జరిపింది.

తాజాగా ప్రాజెక్టుల వివరాలు కోరుతూ ఇరు రాష్ట్రాలకు కమిటీ సభ్య కార్యదర్శి ఎన్‌ఎన్‌ రాయ్‌ ఈ లేఖలు రాశారు. దీనిపై వెంటనే స్పందించిన బోర్డు కమిటీ లేఖను జతపరుస్తూ, ఇరు రాష్ట్రాలకు మంగళవారం మరోమారు లేఖ రాసింది. ప్రాజె క్టులకు సంబంధించిన ప్రాథమిక వివరాలు, 30 ఏళ్లలో ఆయా ప్రాజెక్టుల కింద నమోదైన ఇన్‌ఫ్లో, ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల కింద వినియోగం, ప్రాజెక్టుల్లో నెలవారీ సరాసరి అవç సరాలు, విద్యుదుత్పత్తి తదితర వివరాలను త్వరగా సమర్పించాలని కోరింది. గోదావ రికి కేటాయించిన నీటిని కృష్ణాకు తరలించే అంశాలపై ట్రిబ్యునల్‌ తీర్పులు ఎలా ఉన్నా యి, వివాదాలు ఏయే అంశాల్లో ఉన్నాయి, వివాదాలకు ప్రధాన కారణాలేంటి అన్న అంశాలపైనా అధ్యయనం చేయాలని కూడా కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement