హైదరాబాద్ : కల్తీ రక్తం విక్రయం కేసులో మరో ఆరుగురు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ల్యాబ్ టెక్నిషియన్ నరేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన కీలక సమాచారంతో సుల్తాన్ బజార్ పోలీసులు శనివారం మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నరేంద్ర ప్రసాద్ మూడు రోజలుగా పోలీస్ కస్టడీలో ఉన్నాడు. తమ కస్టడీలో ఉన్న నిందితుడుని పోలీసులు తమదైన శైలీలో ప్రశ్నించడంతో కల్తీ రక్తం విక్రయం వ్యవహారమంతా బయటపెట్టేశాడు.
కాగా, నగరంలోని సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తంలో నార్మల్ సెలైన్ వాటర్ కలిపి కల్తీ చేయడమే కాకుండా వాటికి స్టిక్కర్లు అతికించి విక్రయిస్తుండటం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ల్యాబ్ లో టెక్నీషియన్ గా పనిచేస్తున్న నరేంద్రప్రసాద్ అనే వ్యక్తి ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అధికారుల ఫిర్యాదు మేరకు ఔషధ నియంత్రణ మండలి అధికారులు, పోలీసులు సదరు వ్యక్తి ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించగా నకిలీ గుట్టు రట్టైంది.
కల్తీ రక్తం విక్రయం.. మరో ఆరుగురి అరెస్ట్
Published Sat, May 28 2016 5:56 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement