‘ఇంటాక్’ సభ్యురాలిగా అనురాధారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన చారిత్రక, వారసత్వ కట్టడాల పరిరక్షణ సంస్థ ఇంటాక్ పాలకమండలి సభ్యురాలిగా పి.అనురాధారెడ్డి నియమితులయ్యారు. 25 ఏళ్లుగా చారిత్రక, వారసత్వ కట్టడాలను కాపాడటంలో ఆమె చేస్తున్న సేవలకు ఈ గౌరవం దక్కింది. ప్రస్తుతం ఆమె ఇంటాక్ తెలంగాణ కో-కన్వీనర్‌గా, హైదరాబాద్ చాప్టర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇంటాక్ హెరిటేజ్ వార్షిక సంచిక, వందేళ్ల సివిల్ ఏవియేషన్ సంచిక సంపాదకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పర్యావరణవేత్తగా పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీతోపాటు ఇతర భాషల్లోను చక్కటి ప్రావీణ్యం ఉన్న అనురాధారెడ్డి పర్యావరణ రంగంలో, చారిత్రక వారత్వ కట్టడాల పరిరక్షణ ఉద్యమంలో భాగంగా పశ్చిమ యూరోప్, పోలండ్, చెక్ రిపబ్లిక్, హంగేరి, రష్యా, జోర్డాన్, టర్కీ, యూఎస్‌ఏ, మెక్సికో, టాంజానియా తదితర దేశాల్లోనూ పర్యటించారు.