రాజమండ్రి కాదు...ఇక రాజమహేంద్రవరం | ap government GO issued over Rajahmundry to get back it's original name rajamahendravaram | Sakshi
Sakshi News home page

రాజమండ్రి కాదు...ఇక రాజమహేంద్రవరం

Published Fri, Oct 16 2015 8:35 PM | Last Updated on Tue, Oct 16 2018 8:42 PM

రాజమండ్రి కాదు...ఇక రాజమహేంద్రవరం - Sakshi

రాజమండ్రి కాదు...ఇక రాజమహేంద్రవరం

హైదరాబాద్ : త్వరలో రాజమండ్రి పేరు మారబోతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఓ జీవోను జారీ చేసింది. ఇందుకు సంబంధించి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించాలంటూ రెవెన్యూ శాఖ ఈ జీవో జారీ చేయగా,  ప్రాథమిక నోటిఫికేషన్ జారీ తేదీ నుంచి నెల రోజుల పాటు గడువు ఇవ్వాలి. పేరు మార్పుపై ఎవరైనా అభ్యంతరాలు తెలియచేయాలన్నా, సలహాలు ఇవ్వాలన్నా నెలరోజుల్లోగా తూర్పు గోదావరి జిల్లా కలెకర్టుకు పంపాల్సి ఉంటుంది.

రాజమహేంద్రవరంగా ఉండగా, కాలక్రమంలో రాజమండ్రిగా మారింది.  దీంతో చారిత్రక నగరమైన రాజమండ్రిని రాజమహేంద్రవరంగా మార్చటం ఇక లాంఛనప్రాయమే. రాజమండ్రి పేరు మార్పును ఈనెల 10న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement