వెంకయ్యకు ఇప్పుడు గుర్తుకు రావడంలేదా? | ap pcc chief raghuveera reddy slams venkaiah naidu | Sakshi
Sakshi News home page

వెంకయ్యకు ఇప్పుడు గుర్తుకు రావడంలేదా?

Published Mon, Oct 3 2016 2:31 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ap pcc chief raghuveera reddy slams venkaiah naidu

హైదరాబాద్‌: విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇవ్వాలన్న వెంకయ్య నాయుడికి ఇప్పుడు ఆ విషయం గుర్తుకు రావడం లేదా అని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రశ్నించారు. ఆయనిక్కడ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హామీలపై కూడా కేంద్రం మోసం చేస్తోందన్నారు. వెనకబడిన జిల్లాలకు ప్యాకేజీ, పరిశ్రమలకు రాయితీలకు కూడా కేంద్రం గండికొడుతుందన్నారు. ఇలాగైతే కొత్త పరిశ్రమలు ఎలాగొస్తాయని ప్రశ్నించారు. వెనక బడిన జిల్లాలుగా 7 జిల్లాలనే ఎంపిక చేయడం దారుణమన్నారు. చట్టంలో చెప్పిన అంశాలపై బీజేపీ, టీడీపీ మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement