కేసీఆర్‌ దళిత ద్రోహి: ఆరేపల్లి మోహన్‌ | Arapalli Mohan commented on Kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ దళిత ద్రోహి: ఆరేపల్లి మోహన్‌

Published Fri, Jul 7 2017 2:01 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

కేసీఆర్‌ దళిత ద్రోహి: ఆరేపల్లి మోహన్‌ - Sakshi

కేసీఆర్‌ దళిత ద్రోహి: ఆరేపల్లి మోహన్‌

సాక్షి, హైదరాబాద్‌: దళిత నేత బాబూ జగ్జీవన్‌రామ్‌ వర్ధంతిని అధికారంగా ఎందుకు నిర్వహించడం లేదని టీపీసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ ఆరేపల్లి మోహన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న దళిత నేతలు కూడా జగ్జీవన్‌రామ్‌కు నివాళులు అర్పించకపోవడం అవమానకరమన్నారు.

గురువారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ దళితనేతను కించపరిచేవిధంగా వ్యవహరించిన కేసీఆర్‌ దళిత వ్యతిరేకి అని మండిపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామని చెప్పి మోసం చేశాడని ఆరోపించారు. ఓట్లకోసం కుయుక్తులు, మాయ మాటలు తప్ప దళితుల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement