మోదీకి చిత్తశుద్ధి ఉందా?
మక్కా పేలుళ్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న అసదుద్దీన్
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మక్కామసీదు పేలుళ్ల నిందితులకు మంజూరైన బెయిల్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. మక్కామసీదు బాంబు పేలుళ్లకు వ్యతిరేకంగా సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని కాలాపత్తర్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.
ఉగ్రవాదాన్ని అంతం చేస్తానంటున్న మోదీ తొలుత సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసి తన నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ముస్లింలపై దాడులకు పాల్పడే పోలీసులకు పదోన్నతులివ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మక్కా మసీదు కాల్పులకు సంబంధించి భాస్కరరావు కమిషన్ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.