సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 28న నిర్వహించిన సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం ప్రవేశ పరీక్ష మొదటి పేపరు ‘కీ’ అందుబాటులోకి వచ్చింది. ఉభయ రాష్ట్రాల్లో మొత్తం 20 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్ష లకు దాదాపు 1,100 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 900 మంది (85 శాతం) హాజరయ్యారు.
ఆబ్జెక్టివ్ రూపంలో ఉన్న మొదటి పరీక్ష పత్రానికి సంబంధించిన ‘కీ’ని సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, సాక్షి ఎడ్యుకేషన్.కామ్ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచినట్లు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్ దిలీప్‌రెడ్డి తెలిపారు. పరీక్ష ఫలితాలను ఈ నెల 15న వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అందుబాటులోకి సాక్షి జర్నలిజం పరీక్ష ‘కీ’
Published Wed, Mar 2 2016 3:18 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM
Advertisement