1న విజయవాడకు బీసీ సంక్షేమశాఖ డెరైక్టరేట్ | BC Welfare Directorate Shift to Vijayawada On july 1st | Sakshi
Sakshi News home page

1న విజయవాడకు బీసీ సంక్షేమశాఖ డెరైక్టరేట్

Published Wed, Jun 29 2016 7:41 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

BC Welfare Directorate Shift to Vijayawada On july 1st

జూలై ఒకటవ తేదీన వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ డెరైక్టర్ కార్యాలయం విజయవాడకు తరలనుంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు విజయవాడకు తరలాయి. బందర్ రోడ్డులోని వీఆర్ శిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగా పద్మజ నగర్ ఎన్‌టీఆర్ రోడ్డులోని విశాల్ రెసిడెన్సీలో బీసీ సంక్షేమశాఖ డెరైక్టర్ కార్యాలయం ఏర్పాటు చేశారు.

అక్కడ కార్యాలయ కార్యకలాపాలు మొదలయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లు జరిగాయి. గురువారం లాంచనంగా ప్రారంభించి జూలై ఒకటవ తేదీ నుంచి పూర్తిస్థాయిలో పనిచేసేందుకు చర్యలు తీసుకున్నట్లు బీసీ సంక్షేమ శాఖ డెరైక్టర్ కె హర్షవర్థన్ బుధవారం సాక్షికి చెప్పారు. ఫైల్స్, ఫర్నీచర్ తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement