సాక్షి, సిటీబ్యూరో: పదో తరగతి విద్యార్థులకు బుధవారం నుంచి పబ్లిక్‌పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల లోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు విద్యార్థులకు సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి జంట జిల్లాల్లో మొత్తం 1,74,710 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం 792 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
జిల్లా పరీక్షల పరిశీలకునిగా మోడల్ స్కూల్స్ జాయింట్ డెరైక్టర్ మస్తానయ్యను నియమించారు. విద్యార్థుల కోసం 300 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల సందేహాల నివృత్తికి, సూచనలు, సల హాలకు ప్రత్యేకంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కంట్రోల్ రూం నంబరు: 040 - 65537350
బెస్టాఫ్ లక్..
Published Wed, Mar 25 2015 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 PM
Advertisement