ప్రారంభించనున్న గవర్నర్ నరసింహన్
సాక్షి, హైదరాబాద్: బయో ఏషియా సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హెచ్‌ఐసీసీలో 6 నుంచి 8 వరకు జరిగే ఈ సదస్సుకు 50 దేశాలకు చెందిన 1,500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఆరోగ్యం, ఫార్మా తదితర రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిపై ఈ సదస్సులో చర్చిస్తారు. సదస్సును గవర్నర్ నరసింహన్ ప్రారంభిస్తారని నిర్వాహకులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
జీనోమ్‌వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డును నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ కుర్త్ ఉత్రిచంద్, ఫార్మా సూటికల్స్ అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ పాల్ స్టోఫెల్స్‌లకు గవర్నర్ అందజేస్తారు.
రేపటి నుంచి బయో ఏషియా సదస్సు
Published Sun, Feb 5 2017 2:16 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Advertisement