హైదరాబాద్: అసాంఘిక శక్తుల ఆటకట్టించేందుకు, నేరాల నియంత్రణకు సిటీ పోలీసులు తలపెట్టిన కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం.. మల్కాజ్ గిరిలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు జరిగింది. డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 300 మంది పోలీసులు ఆర్టీసీ కాలనీ పరిసర ప్రాంతాన్ని జల్లెడపట్టారు.
ఈ క్రమంలో 60 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారిలో ఇద్దరు పరారీలో ఉన్న నేరస్తులు కావడంతో అరెస్టుచేశారు. ఎలాంటి ఆధారపత్రాలు లేని 141 వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 110 బైక్స్, 27 కార్లు, 4 కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
మల్కాజ్ గిరిలో కార్డన్ సెర్చ్:భారీగా వాహనాల పట్టివేత
Published Sun, Nov 8 2015 6:54 AM | Last Updated on Sun, Sep 3 2017 12:14 PM
Advertisement
Advertisement