
ఇంట్లో ఉంటే దొంగిలిస్తారని... బ్యాగులో పెట్టుకుంది..
హైదరాబాద్ : చైతన్యపురి నుంచి చౌటుప్పల్‌కు ఆటోలో వెళ్తున్న మాధవి అనే మహిళ హ్యాండ్ బ్యాగ్ మాయమైంది. చైతన్యపురిలో నివాసముంటున్న మాధవి వరలక్ష్మీ వ్రతం సందర్భంగా చౌటుప్పల్లోని తన ఇంటికి వెళదామని అనుకుంది. ఇంట్లో ఎవరూ లేకపోతే దొంగలు పడతారు అని భావించిన ఆమె.... ఇంట్లో ఉన్న 30 తులాల బంగారం, రూ.20 వేల నగదు బ్యాగ్‌లో పెట్టుకుని ఆటోలో చౌటుప్పల్‌కు బయలుదేరింది.
అయితే హయత్‌నగర్ వచ్చేసరికి నగలు, నగదు ఉన్న బ్యాగ్ మాయమైంది. దీంతో బాధితురాలు హయత్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు.