దత్తత విషయాన్ని బాబు మరిచిపోయారు: చాడ | chada venkat reddy fire on ap cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

దత్తత విషయాన్ని బాబు మరిచిపోయారు: చాడ

Published Thu, May 5 2016 3:20 AM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM

దత్తత విషయాన్ని బాబు మరిచిపోయారు: చాడ - Sakshi

దత్తత విషయాన్ని బాబు మరిచిపోయారు: చాడ

సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాను చంద్రబాబు దత్తత తీసుకున్న విషయాన్ని ఆయన మరిచిపోయినట్లున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అ న్నారు. పాలమూరు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని ఖండించారు. అత్యంత వెనుకబడిన జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులపై ఇలా వ్యవహరించడం చంద్రబాబుకు సరికాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను రెండు రాష్ట్రాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. వైషమ్యాలు పెంచేందుకు ఏపీ అధికార, ప్రతిపక్షాలు పూనుకోవడం దుర్మార్గమన్నారు. మంత్రి హరీశ్‌రావు ఏపీ మంత్రి దేవినేనితో మాట్లాడటం మంచి పరిణామమన్నారు. దీనిపై ఏకతాటిపైకి రావాలని అన్ని పార్టీలనూ సీఎం కేసీఆర్ కోరడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement