
వర్షాల వల్ల ప్రాణనష్టంపై కేసీఆర్ దిగ్భ్రాంతి
జంట నగరాలలో బుధవారం ఉదయం నుంచి కురిసిన భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నతాధికారులతో సమీక్షించారు. వర్షాల వల్ల ప్రాణనష్టం సంభవించడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. సహాయ చర్యలు మరింత ముమ్మరం చేయాలని తెలిపారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచించారు.