మనిషి ఆశాజీవిగానే ఉండాలి: చిరంజీవి
మనిషి జీవితానికి, ఉగాది పచ్చడికి అవినాభావ సంబంధం ఉందని కేంద్ర మంత్రి చిరంజీవి విపులీకరించారు. ఉగాది పచ్చడి రుచి ఎలా ఉంటుందో మనిషి జీవితం కూడా అలానే ఉంటుందని ఆయన విశదీకరించారు.ఆ రెండు షడ్ రుచుల సమాహారమే అని తెలిపారు. సోమవారం నగరంలోని ఇందిరాభవన్లో జరిగిన జయనామ సంవత్సర ఉగాది వేడుకలలో చిరంజీవి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ... విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్న నిరాశ చెందవద్దని ఆయన పార్టీ కార్యకర్తలకు హితవు పలికారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు భవిష్యత్త్పై ఆశలను వదులుకోవద్దని సూచించారు. మనిషి ఆశాజీవిగానే ఉండాలన్నారు. ఆశావాదంతో పని చేస్తూ పోతే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉంటుందని అన్నారు. తెలుగు ప్రజలందరికి ఈ సందర్బంగా చిరంజీవి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఉగాది వేడుకలలో మాజీ మంత్రులు డొక్క మాణిక్య వర ప్రసాద్, సీ. రమచంద్రయ్య తదితరులు హాజరైయ్యారు.