మండల సమితుల శిక్షణకు సీఎం
► ఒకట్రెండు చోట్లకు వెళ్లే అవకాశం.. ఖరారు కాని పర్యటన
► నేటితో ముగియనున్న సమితుల ఏర్పాటు.. రేపట్నుంచి శిక్షణ
► ఇప్పటివరకు 8,640 గ్రామ రైతు సమన్వయ సమితుల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: మండల రైతు సమన్వయ సమితుల ఆధ్వర్యంలో జరిగే శిక్షణా కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా హాజరుకానున్నారు. ఈ నెల 10 నుంచి 14 వరకు ఐదు రోజులపాటు ఇవి జరగనున్నాయి. ఒకట్రెండు కార్యక్రమాలకు సీఎం హాజరవుతారని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అయితే మండలం, తేదీ ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నాయి. రైతు సమన్వయ సమితుల ప్రక్రియ శనివారంతో ముగియనుంది.
మొత్తం 10,733 రెవెన్యూ గ్రామాలకుగాను శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 8,640 సమితులు ఏర్పాటైనట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. మండల రైతు సమాఖ్యలు ఎన్ని ఏర్పాటయ్యాయన్న సమాచారం ఇంకా సేకరించలేదు. వాస్తవంగా గ్రామ, మండల, జిల్లా రైతు సమితులన్నీ 9వ తేదీ నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామ, మండల సమితులు మాత్రమే అనుకున్న ప్రకా రం పూర్తవుతున్నాయి. జిల్లా రైతు సమన్వయ సమితులు మాత్రం ఈనెల 14 నాటికి ఏర్పా టుకావొచ్చని అధికారులు చెబుతున్నారు.
పోచారం సుడిగాలి పర్యటనలు
మండల రైతు సమన్వయ సమితుల ఆధ్వర్యంలో జరిగే శిక్షణ కార్యక్రమాల్లో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొననున్నారు. ఐదు రోజులపాటు రోజుకు ఐదు చొప్పున 25 మండల రైతు సమితుల శిక్షణలో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు. అందుకు ఆయన హెలీకాప్టర్‌లో వెళ్లనున్నారు.ఇందులో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెళ్లే అవకాశం ఉంది.
ఆయనతోపాటు వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ జగన్‌మోహన్ కూడా వెళ్తారని సమాచారం. ఇప్పటికే మండల రైతు సమన్వయ సమితి శిక్షణల కోసం వ్యవసాయశాఖ ఒక్కో మండలానికి రూ.50 వేల చొప్పున విడుదల చేసింది. ఖర్చు ఎక్కువైతే బిల్లులు పెట్టుకునే వెసులుబాటు కల్పించింది. మండల రైతు శిక్షణలకు ప్రతిపక్షాల నుంచి ఎలాంటి ఇబ్బందుల తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నేడు హైదరాబాద్‌లో 200 మందికి శిక్షణ
మండల రైతు సమన్వయ సమితులకు శిక్షణ ఇచ్చేందుకు ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదుగురు వ్యవసాయాధికారులను ఎంపిక చేశారు. వారిలో ఇద్దరు చొప్పున దాదాపు 200 మందికి శనివారం హైదరాబాద్‌లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శిక్షణ ఇవ్వనున్నారు. వీరు వెళ్లి మండల రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇస్తారు. వారు గ్రామ రైతు సమన్వయ సమితులకు శిక్షణ ఇస్తారు. శనివారంనాటి కార్యక్రమంలో మంత్రి పోచారం పాల్గొంటారు.
నేడు హైదరాబాద్‌లో 200 మందికి శిక్షణ
మండల రైతు సమన్వయ సమితులకు శిక్షణ ఇచ్చేందుకు ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదుగురు వ్యవసాయాధికారులను ఎంపిక చేశారు. వారిలో ఇద్దరు చొప్పున దాదాపు 200 మందికి శనివారం హైదరాబాద్‌లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శిక్షణ ఇవ్వనున్నారు. వీరు వెళ్లి మండల రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇస్తారు. వారు గ్రామ రైతు సమన్వయ సమితులకు శిక్షణ ఇస్తారు. శనివారంనాటి కార్యక్రమంలో మంత్రి పోచారం పాల్గొంటారు.