
సీఎం కేసీఆర్‌కు పలువురి విషెస్!
హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం 63వ వసంతంలో అడుగుపెట్టారు. కేసీఆర్‌గా ప్రజల్లో పాపులర్ అయిన ఆయన 1954 ఫిబ్రవరి 17న జన్మించారు. తెలంగాణ ఉద్యమ రథసారథిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్న కేసీఆర్ కు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గవర్నర్ ఆకాంక్షించారు. అలాగే మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, జుపల్లి కృష్ణారావు, సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఎమ్మెల్యేలు రవీందర్ రెడ్డి, బాలారాజు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు తదితరులు కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, పుట్టినరోజు నాడే రాజ్‌భవన్‌లో సిబ్బంది కోసం రూ. 100 కోట్లతో నిర్మించనున్న క్వార్టర్స్‌కు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, పలువురు తెలంగాణ మంత్రులు పాల్గొన్నారు.