'సైనికుల సంక్షేమానికి ప్రత్యేక నిధి' | cm kcr speaks in assembly over Soldiers Welfare Fund | Sakshi
Sakshi News home page

'సైనికుల సంక్షేమానికి ప్రత్యేక నిధి'

Published Tue, Jan 17 2017 12:03 PM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

'సైనికుల సంక్షేమానికి ప్రత్యేక నిధి' - Sakshi

'సైనికుల సంక్షేమానికి ప్రత్యేక నిధి'

హైదరాబాద్‌ : మాజీ సైనికులకు సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. మంగళవారం ఉదయం సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ ఈ నిధికి ఏడాదికి మంత్రులు రూ.25వేలు, ఎమ్మెల్యేలు రూ.10 వేలు వారి జీతాల నుంచి విరాళంగా ఇస్తామన్నారు.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసిన మాజీ సైనికులకు రెండు పెన్షన్లు పొందే వెసులుబాటు కల్పిస్తామన్నారు. వరంగల్‌లో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయడంతో పాటు జాతీయ అవార్డులు పొందిన సైనికులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున భారీగా నజరానాలు ప్రకటించారు. పరమవీరచక్ర అవార్డు గ్రహీతలకు రూ. 20 కోట్లు, మహావీరచక్ర, కీర్తిచక్ర అవార్డు పొందిన వారికి రూ.1.25 కోట్లు, వీరచక్ర, శౌర్యచక్ర అవార్డులు పొందిన వారికి రూ.75 లక్షలు, సేనా మెడల్‌ గ్యాలంటరీ అవార్డు పొందిన వారికి రూ.30 లక్షలు ఇస్తామన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ అభివృద్ధిపై మంగళవారం అసెంబ్లీలో చర్చ జరుగుతోంది.

పది రోజుల విరామం తర్వాత అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు మంగళవారం తిరిగి ప్రారంభమైయ్యాయి. అసెంబ్లీలో ప్రతిపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. అర్చకులు, దేవాదాయ ఉద్యోగులకు ట్రెజరీల ద్వారా జీతాలు చెల్లించే అంశంపై బీజేపీ, రోహిత్‌ వేముల మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌, ఎన్టీఆర్‌ వర్థంతిని అధికారికంగా నిర్వహించాలని టీడీపీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement