రాష్ట్రపతికి ఘనస్వాగతం | CM KCR Welcomes President Pranab Mukherjee At Hyderabad | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతికి ఘనస్వాగతం

Published Wed, Apr 26 2017 12:17 PM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

రాష్ట్రపతికి ఘనస్వాగతం - Sakshi

రాష్ట్రపతికి ఘనస్వాగతం

హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు గోవా నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి రాష్ట్రపతి చేరుకున్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ, స్పీకర్‌ మధుసూదనాచారి, పలువురు రాష్ట్ర మంత్రులు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని రాష్ట్రపతికి సాదరంగా ఆహ్వానం పలికారు. అక్కడ నుంచి శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు నేరుగా ఉస్మానియా యూనివర్సిటీకి రాష్ట్రపతి బయలుదేరి వెళ్లారు. సాయంత్రం ఇఫ్లూ స్నాతకోత్సవంలో ప్రణబ్‌ పాల్గొంటారు. కాగా.. ఓయూలో రాష్ట్రపతి పర్యటనను 45 నిమిషాలకు కుదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement