అవతరణ వేడుకలకు రండి | Come to formation celebration | Sakshi
Sakshi News home page

అవతరణ వేడుకలకు రండి

Published Tue, May 31 2016 3:26 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

అవతరణ వేడుకలకు రండి - Sakshi

అవతరణ వేడుకలకు రండి

గవర్నర్ నరసింహన్‌ను ఆహ్వానించిన సీఎం కేసీఆర్

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలంటూ గవర్నర్ నరసింహన్‌ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం.. గవర్నర్‌తో భేటీ అయ్యారు. జూన్ 2 మధ్యాహ్నం హెచ్‌ఐసీసీలో వివిధ రంగాలకు చెందిన 3 వేల మంది ప్రముఖులతో ఆత్మీయ సమ్మేళనంతోపాటు ప్రభుత్వం అధికారిక విందు ఏర్పాట్లు చేసింది.

ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా గవర్నర్‌కు సీఎం ఆహ్వాన పత్రిక అందించినట్లు తెలిసింది. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులతోపాటు వంద మంది పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రతి జిల్లా నుంచి యాభై మంది ప్రముఖులను ఈ సమ్మేళనానికి ఆహ్వానించినట్లు సీఎం గవర్నర్‌కు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement