తరలింపు, కూల్చివేతపై భిన్నాభిప్రాయాలు
ఎటూ తేల్చుకోలేకపోతున్న ప్రభుత్వం
ఆస్పత్రిని సందర్శించిన టీజేఏసీ, రిటైర్డ్ న్యాయమూర్తి, ఇంటాక్ బృంద ం
కూల్చివేత అవసరం లేదని పలువురి అభిప్రాయం
సిటీబ్యూరో: ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం కూల్చివేత వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరినందున, దీన్ని నేలమట్టం చేసి ఇదే చోట మరో రెండు బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తుండగా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సహా బీజేపీ, వామపక్షాలు, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్, తెలంగాణ ఉద్యమ వేదిక, పూర్వ విద్యార్థుల సంఘం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా సోమవారం ఢిల్లీ నుంచి ఆస్పత్రిని సందర్శించేందుకు వచ్చిన ఇంటాక్ బృందం సహా రిటైర్డ్ న్యాయమూర్తి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ప్రతిపక్షాలకు మరింత బలం చూకూర్చినట్లైంది. భవనాన్ని కూల్చాలనే వారి కంటే..పరిరక్షించాలనే వారికే మద్దతు రోజు రోజుకు పెరుగుతుండటంతో ఈ అంశంపై ఏ ం చేయాలో తెలియక ప్రభుత్వం కొంత అయోమయంలో పడింది.
రోగుల భద్రతే ముఖ్యం
ఎప్పుడు కూలుతుందో తెలియని ఈ భవనంలో రోగులకు చికిత్సలు అందించడం ఏమాత్రం సురక్షితం కాదు. వైద్యుల విజ్ఞప్తి మేరకు ఇటీవల ఆస్పత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్ ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. శిథిలావస్థకు చెందిన వారసత్వ కట్టడాల కంటే ప్రభుత్వానికి రోగుల ప్రాణాలే ముఖ్యం. వారిని కాపాడేందుకు ఎంత రిస్కైనా తీసుకుంటాం. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు, ప్రభుత్వమంటే గిట్టని కొంత మంది పనిగట్టుకుని ఈ విషయంపై దుష్ర్పచారం చేస్తున్నారు. అత్యవసర చికిత్సలు సహా, ఇన్‌పేషంట్లు సర్వీసులు, ఓపీ సేవలు అన్ని ఇక్కడే అందిస్తాం. శస్త్రచికిత్స తర్వాత స్టేబుల్‌గా ఉన్న రోగులను మాత్రమే ప్రత్యామ్నాయంగా ఏరా్పాటు చేసిన ఆస్పత్రుల్లో సర్దుబాటు చేస్తాం. పాత భవనం కూల్చాలా? లేదా అనే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
- లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
‘ఉస్మానియా’పై అయోమయం!
Published Tue, Aug 4 2015 12:32 AM | Last Updated on Sat, Aug 25 2018 5:33 PM
Advertisement
Advertisement