కేబీఆర్ పార్కు వద్ద డయాబెటిక్ వాక్ | Diabetic walk to be held on 14th November | Sakshi
Sakshi News home page

కేబీఆర్ పార్కు వద్ద డయాబెటిక్ వాక్

Published Sun, Nov 6 2016 7:21 PM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM

Diabetic walk to be held on 14th November

హైదరాబాద్: ఈ నెల 14వ తేదీన ప్రపంచ మధుమేహ దినోత్సవ సందర్భంగా బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద ఉదయం ఏడు గంటలకు డయాబెటిక్ వాక్ ను నిర్వహించనున్నారు. ఈ మేరకు వాక్ నిర్వాహకులు లయన్స్ చైల్డ్ డెవలప్ మెంట్ సెంటర్ జిల్లా ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ లయన్ ఏ విజయ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.

వందలాది మంది వాకర్లతో కలిసి మధుమేహ అవగాహన నడకను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డా. లక్ష్మారెడ్డి విచ్చేయనున్నట్లు చెప్పారు. షుగర్ 365 డేస్ క్లినిక్ అధినేత డాక్టర్ ప్రసాద్‌రావుతో కలిసి ఈ భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హోం శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డిని కూడా కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement