హైదరాబాద్: తాగినమైకంలో ఓ వ్యక్తి తన మిత్రుడినే హత్య చేశాడు. ఫలక్నుమాలో ఈ దారుణం జరిగింది.ఓ మిత్రుడు తాగిన మత్తులో తన స్నేహితుడిని కత్తితో పొడిచాడు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సంఘటన వివరాలు సేకరిస్తున్నారు.