సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-1లో ర్యాంకు పొందిన విద్యార్థులు వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ కోర్సుల్లో చేరేందుకు అక్టోబర్ 3 నుంచి 15 వరకు ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాల్లో ఉన్న సుమారు 800 సీట్లకు కౌన్సెలింగ్ జరుగ నుంది. కౌన్సెలింగ్ షెడ్యూల్ కోసం విశ్వవిద్యాలయాల వెబ్‌సైట్లలో చూడవచ్చన్నారు.
అక్టోబర్ 3 నుంచి ఎంసెట్ 1 కౌన్సెలింగ్
Published Wed, Sep 28 2016 2:06 AM | Last Updated on Sat, Sep 29 2018 6:18 PM
Advertisement
Advertisement