Jayasankar
-
భారత్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుంది
వాషింగ్టన్ : భారత్ ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ చట్టం విషయంలో(సీఏఏ) తాము స్పందించిన తీరులో ఎటువంటి మార్పు ఉండబోదని అమెరికా స్పష్టం చేసింది. అయితే దేశంలోని అంతర్గత చర్చల తర్వాతే పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించారని అమెరికా దౌత్యవేత్త తెలిపారు. మైనారిటీ వర్గాల పరిరక్షణకు తాము నిరంతరం పాటుపడతామని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో తెలిపారు. బుధవారం వాషింగ్టన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పాంపియోతో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాంపియో మాట్లాడుతూ.. భారత్‌లో ప్రజాస్వామ్య చర్చలు హేతుబద్దంగా జరుగుతాయని పేర్కొన్నారు. భారత్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుందని కొనియాడారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్ పాల్గొన్నారు. భారత్‌కు సంబంధించిన విషయాలపైనే కాక ప్రపంచంలోని అనేక సమస్యలపై అమెరికా స్పందించిందని పాంపియో స్పష్టం చేశారు. అనంతరం పౌరసత్వ చట్టం ప్రజాస్వామ్యాన్ని, మతపరమైన హక్కులను కాపాడడానికి ఏ మేరకు ఉపయోగపడుతుందోనని పాంపియో ప్రశ్నించగా.. ప్రపంచ వ్యాప్తంగా మతపరమైన మైనారిటీలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని, భారత్‌లో మైనారిటీలకు రక్షణ కలిగించే విధంగా అనేక చర్యలు తీసుకుంటున్నామని జయశంకర్ సమాధానం ఇచ్చారు. -
తంగడపల్లిలో జయశంకర్ విగ్రహం ఆవిష్కరణ
చౌటుప్పల్ (మునుగోడు) : తంగడపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన దివంగత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆదివారం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో జయశంకర్ పాత్ర ఎంతో కీలకమన్నారు. 1969 నుంచి తెలంగాణ సాధనే లక్ష్యంగా నిరంతరం శ్రమించారని కొనియాడారు. తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని తెలిపారు. నేటి తరానికి ఆచార్య జయశంకర్ ఆదర్శనీయుడని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడవాలని కోరారు. సర్పంచ్ ముటుకుల్లోజు దయాకరాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, మార్కెట్ చైర్మెన్ బొడ్డు రేవతిశ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మెన్ చిరందాసు ధనుంజయ, ఎంపీటీసీ బీపీ కరుణ, గ్రంధాలయ చైర్మెన్ ఊడుగు మల్లేశం, ఉప సర్పంచ్ అరిగె కిష్టయ్య, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
జయశంకర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి జగిత్యాలటౌన్: జయశంకర్ ఆశయాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కళాశాల ఆవరణలోని సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సామాజిక తెలంగాణ దిశగా ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జయశంకర్ ఆశయాలను కేసీఆర్ తుంగలో తొక్కుతున్నరన్నారు. కార్యక్రమంలో డెమొక్రటిక్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఉమామహేశ్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, బాలె శంకర్, వైస్ ఎంపీపీ గంగం మహేశ్, బండ శంకర్, తదితరులు పాల్గొన్నారు. -
జయశంకర్‌కు లండన్‌లో ఘననివాళి
కేసీఆర్ తెరాస సపోర్టర్స్ ఆఫ్ యూకే ఆధ్వర్యంలో తెలంగాణ సిద్దాంత కర్త ప్రొ.జయశంకర్ జయంతి వేడుకులని లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి తెరాస శ్రేణులు, తెలంగాణ వాదులు పాల్గొన్నారు. జయశంకర్ చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు. ప్రొ.జయశంకర్‌ను స్మరిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమానికి సురేష్ గోపతి అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ భావజాల వ్యాప్తిలో జయశంకర్ పాత్రా గొప్పదని, తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆ జన్మ బ్రహ్మచారి కొత్తపల్లి జయశంకర్ అని అన్నారు. నాన్ ముల్కీ ఉద్యమం నుంచి మలి దశ తెలంగాణ సాధన పోరాటం వరకూ ఆయన పాత్ర చిరస్మరణీయమని, కడవరకూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే జయశంకర్ పని చేశారని, అలాంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సంతోష సమయంలో ఆయన మన మధ్య లేకపోవడం చాల బాధాకరం అని పేర్కొన్నారు. గోలి తిరుపతి మాట్లాడుతూ.. అనుకున్నఆశయ సాధనకై జయశంకర్ చేసిన కృషిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. జయశంకర్ జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని, రాబోయే తరాలకు ఇది ఎంతోగానో ఉపయోగపడుతుందని కొనియాడారు. రంగు వెంకట్ మాట్లాడుతూ.. ప్రవాస తెలంగాణ సంఘాలన్నీ జయశంకర్ మానసపుత్రికలని, వారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలలో ప్రవాస తెలంగాణవాసులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సంస్థ వ్యవస్ధాపకుడు సిక్కా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రొ.జయశంకర్ జయంతి వేడుకల సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ఫిల్టర్‌ను అందజేసినట్లు చెప్పారు. తెలంగాణ యూకే జాగృతి అధ్యక్షులు సుమన్ బలమూరి, సభ్యులు లండన్ గణేష్, జేటీఆర్డీసీ అధ్యక్షులు సృజనా రెడ్డి చాడ, సభ్యులు మధు అందేం, యూకే లో స్థిరపడి, బీబీసీ సంస్థలో పనిచేసిన కరీంనగర్ జిల్లా వాసి భారతి, కేసీఆర్ తెరాస సపోర్టర్స్ ఆఫ్ యూకే సంస్థ సభ్యులు గోలి తిరుపతి, భాస్కర్ మొట్ట, ప్రశాంత్, శ్రీధర్ , రఘు నక్కల, నరేష్ మర్యాల, వెంకట్ రంగు, వేణు రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అక్టోబర్ 3 నుంచి ఎంసెట్ 1 కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-1లో ర్యాంకు పొందిన విద్యార్థులు వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ కోర్సుల్లో చేరేందుకు అక్టోబర్ 3 నుంచి 15 వరకు ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాల్లో ఉన్న సుమారు 800 సీట్లకు కౌన్సెలింగ్ జరుగ నుంది. కౌన్సెలింగ్ షెడ్యూల్ కోసం విశ్వవిద్యాలయాల వెబ్సైట్లలో చూడవచ్చన్నారు. -
ముగిసిన రెండో విడత కౌన్సెలింగ్
రాజేంద్రనగర్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు రెండో విడత కౌన్సిలింగ్ ముగిసిందని ఎస్.సుధీర్‌కుమార్ తెలిపారు. ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు ఈ కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు వారికి కేటాయించిన పాలిటెక్నిక్ కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని లేకుంటే సీటు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు రిపోర్ట్ చేయక పోవడం వల్ల ఏర్పడే ఖాళీలను అక్టోబర్ 1వ తేదీన నిర్వహించే స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు వివరించారు. -
29 నుంచి అగ్రి డిప్లోమా కోర్సు ప్రారంభం
హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని రెండేళ్ల వ్యవసాయ, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, మూడేళ్ల అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 29 నుంచి వచ్చే నెల 2 వరకు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు శనివారం తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులు మాత్రమే కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని పేర్కొన్నారు. అగ్రి ఇంజనీరింగ్ సెట్-2015’కు 5వ తేదీ వరకు దరఖాస్తు గడువు మూడేళ్ల అగ్రి ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తయిన విద్యార్థుల కోసం నిర్వహించే అగ్రి ఇంజనీరింగ్ సెట్-2015కు వచ్చే నెల 5 లోపల దరఖాస్తు చేసుకోవాలని ప్రవీణ్‌రావు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీలో మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసుకున్న వారు మాత్రమే సెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. సెట్లో ర్యాంకులు, మెరిట్, ఇతర నిబంధనల ప్రకారం అగ్రి ఇంజనీరింగ్ రెండో సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు. సెట్ ప్రవేశపరీక్ష వచ్చే నెల 11న రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ కళాశాలలో జరుగుతుంది.