రాజేంద్రనగర్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు రెండో విడత కౌన్సిలింగ్ ముగిసిందని ఎస్.సుధీర్‌కుమార్ తెలిపారు. ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు ఈ కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు.
అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు వారికి కేటాయించిన పాలిటెక్నిక్ కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని లేకుంటే సీటు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు రిపోర్ట్ చేయక పోవడం వల్ల ఏర్పడే ఖాళీలను అక్టోబర్ 1వ తేదీన నిర్వహించే స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు వివరించారు.
ముగిసిన రెండో విడత కౌన్సెలింగ్
Published Fri, Sep 23 2016 6:44 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
Advertisement
Advertisement