
జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల
చౌటుప్పల్ (మునుగోడు) : తంగడపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన దివంగత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆదివారం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో జయశంకర్ పాత్ర ఎంతో కీలకమన్నారు. 1969 నుంచి తెలంగాణ సాధనే లక్ష్యంగా నిరంతరం శ్రమించారని కొనియాడారు. తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని తెలిపారు.
నేటి తరానికి ఆచార్య జయశంకర్ ఆదర్శనీయుడని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడవాలని కోరారు. సర్పంచ్ ముటుకుల్లోజు దయాకరాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, మార్కెట్ చైర్మెన్ బొడ్డు రేవతిశ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మెన్ చిరందాసు ధనుంజయ, ఎంపీటీసీ బీపీ కరుణ, గ్రంధాలయ చైర్మెన్ ఊడుగు మల్లేశం, ఉప సర్పంచ్ అరిగె కిష్టయ్య, వార్డు సభ్యులు, టీఆర్‌ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment